Breaking News

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలి

-నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
-జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు
-ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ఎంతవుందో రాజకీయ పార్టీల నుండి కూడా అంతే సహకారం అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న వ్యక్తులకు సంబందించిన ఫోటోలను, ఫ్లెక్సీలను అన్ని కార్యాలయాలు, ప్రైవేటు, పబ్లిక్ ప్రదేశాలలో పూర్తిగా ఎన్నికల నిబంధనల మేరకు తొలగించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ చిత్తశుద్ధితో, భాధ్యతాయుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలతో పాటు ఎన్నికల విధుల నిర్వహణకు ఎటువంటి కొరత లేకుండా సిబ్బందిని సంసిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వారి తరపు ఐటి సహాయకులకు ఎన్నికల నిబంధనలకు సంబందించిన అన్ని రకాల అంశాలపై అవగాహన, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. తక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తించిన ఫోటోలను,పోస్టర్లను మరియు ఫ్లెక్సీ/బ్యానర్లను తొలగించడానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు, బ్యానర్లు తొలగించడంతో పాటు.. ప్రయివేటు కార్యాలయాల్లో, ప్రాంతాల్లో ఫ్లెక్సీ/పోస్టర్లను/బ్యానర్లను తొలగించే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలోనున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదన్నారు. సభలు, సమావేశాలు, వాహనాలు అన్నింటికీ ముందస్తు అనుమతి పొందాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి అభ్యర్థి, రాజకీయ పార్టీ ప్రతినిధి, ప్రశాంత వాతావరణానికి యెటువంటి భంగం కలగకుండా ప్రవర్తించాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డిఆర్ఓ వి. శ్రీనివాసరావు, సెక్షన్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *