విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారితోట,సంగుల పెరయ్య స్ట్రీట్,మిరియాల వారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి, అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించారు.ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నాం అని అన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 35కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది అని,గత 15 రోజులుగా ఈ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్లకు కలిగిన లబ్ది గురుంచి సంతోషంగా చెబుతూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నారు.స్వర్గీయ వైయస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని జగన్ గారి బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుంది అని ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News