Breaking News

బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు, ఎల్డీఎం జయవర్ధన్ తో కలిసి బ్యాంకర్లతో ఎన్నికల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందన్నారు. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నుండి వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరిచి బ్యాంకు చెక్కు పుస్తకాన్ని జారీ చేసేందుకు వారికి అన్ని విధాలా సహకరించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థి పేరిట గాని,  అభ్యర్థి , ప్రధాన ఎన్నికల ఏజెంట్ తో కలిపి సంయుక్త ఖాతాను తెరవ వచ్చన్నారు. గత రెండు నెలలుగా ఒక లక్ష రూపాయలకు మించి ఏదైనా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంటే వాటి వివరాలను అందజేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు.  ఒక బ్యాంకు ఖాతా నుండి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు బ్యాంకు లావాదేవీలు పూర్తయ్యాక దినసరి నివేదిక అందజేయాలన్నారు. ఏటీఎం నగదు తీసుకొని వెళ్లే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వాహనాల సిబ్బంది తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ కలిగిన బ్యాంకుల లేఖలు, గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అందులో బ్యాంకుకు సంబంధించిన నగదు మాత్రమే ఉండాలని మూడో వ్యక్తి లేదా ఇతర వ్యక్తులకు సంబంధించిన నగదు ఉండరాదన్నారు.

ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి భాస్కరరావు పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *