-97.05 శాతం విద్యార్థులు హాజరు
-ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాల్లో 6,39,959 మంది నమోదవ్వగా 6,21057 (97.05% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 18,902 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1367 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ కృష్ణలంకలోని APSRMC High schoolను, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.