Breaking News

రెండో రోజు ప్రశాంతంగా జరిగిన పదో తరగతి పరీక్షలు

-97.05 శాతం విద్యార్థులు హాజరు
-ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాల్లో 6,39,959 మంది నమోదవ్వగా 6,21057 (97.05% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 18,902 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1367 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్  కృష్ణలంకలోని APSRMC High schoolను, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *