-ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించగా తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీ శ తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు.
మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం సిఈఓ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఈఓ గారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని, ప్రస్తుతం హైవేలు, మెయిన్ రోడ్ల ప్రక్కనున్న హార్డింగ్ లను కూడా సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్నందున నూతన అనుమతులను ఏమాత్రం ఇవ్వరాదని సూచించారు. బోర్డర్ చెక్ పోస్ట్ ల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సివిజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం జరగాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూ.చా తప్పక పాటించాలని, ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు డి ఆర్ ఓ పెంచల కిషోర్, సి-విజిల్, ఎంసిసి,మీడియా, ఈవిఎం నోడల్ అధికారులు ప్రసాద రావు, సూర్య నారాయణ, బాల కొండయ్య, కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.