– కలెక్టరేట్ సువిధా , నామినేష్లను కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-గోడలపై ఎటువంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదు
-ఎన్నికల ప్రవర్తన నియమావళి అత్యంత కీలకం
-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చెయ్యరాదు… అంటువంటి సందర్భంలో స్ధానిక సంస్థ ల చట్టం మేరకు అనుమతులు తప్పనిసరి
-కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అనుమతులను అనుసరించి ప్రచారం చేపట్టాలని, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రచారము కోసం అనుమతులు తప్పనిసరి అని కలక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీ ఆర్వో జీ. నరసింహులు, రాజమండ్రీ పార్లమెంటు ఏ ఆర్వో ఆర్. కృష్ణ నాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన దృష్ట్యా ఫారం 7 , 8 స్వీకరించడం నిలుపుదల చేశామని, నామినేషన్లు స్వీకరించే చివరి రోజు వరకు అనగా 25.4.24 వరకు ఫారం 6 ను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఏప్రియల్ 18 న జారీ చెయ్యడం జరుగుతుందనీ, 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నా మన్నారు. ఏప్రియల్ 26 న నామినేషన్లను స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29 తో ముగుస్తుందని తెలియ చేశారు. మే 13 న ఎన్నికలు, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహించి, జూన్ 6 వ తేదీతో ఎన్నికలను పూర్తి చేసే తేదీ గా తెలియ చేశారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అత్యంత కీలకం, ఎం సీ ఎం సి అమలు చేయడం కోసం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన 7 పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి లో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
రాజమండ్రీ పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్. కృష్ణా నాయక్ ఓటరు జాబితా, పెండింగు ఫారం లు, ఎమ్ సీ ఎమ్ సి నియమాలకు చెందినా డాక్యుమెంట్ల ను అందచేశారు
అనంతరము సువిధ యాప్ పనితీరు, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. url : subidha.eci.gov.in పోర్టల్ లో ఎన్నికల కమిషన్ కు రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసి అభ్యర్ధి వివిధ అనుమతుల కోసం ఈ సి ఐ “సువిధ” యాప్ రూపొందించడం జరిగిందని సంభందిత అనుమతులు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని , అనంతరం సంతకం చేసిన పత్రాలను సంభందిత రిటర్నింగ్ అధికారికి అందచేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలోనే జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, కే ఆర్ ఆర్ సి ఎస్ డి డి ఆర్. కృష్ణ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నలబాటి రమేష్ (శ్యామ్) , బిజేపి పి వి లక్ష్మీ , సీపీఐ (ఎమ్) ఏస్ ఎస్ మూర్తి , టిడిపి సిహెచ్. శ్రీనివాస రావు , బీ ఎస్పి – జీ. చిత్రసేను , ఆప్ – ఎన్. సుబ్రహ్మణ్యం , వైయస్ఆర్ సీపీ – కే. రాజశేఖర్, ఎలక్షన్స్ డిటి ఎమ్. సునీల్ కుమార్, తులసి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News