Breaking News

మోడల్ ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్

-సువిధా హెల్ప్ డెస్క్ కేంద్రం సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు.

బుధవారము ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా హెల్ప్ డెస్క్ , నమూనా ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న కార్యకలపై సమాచారాన్ని తెలుసు కోవడం జరిగింది. తొలుత కలెక్టర్ మాధవీలత సువిధా కేంద్రానికి వొచ్చి అక్కడ రాజకీయ పార్టీలకు, పోటిలో ఉండే అభ్యర్థులకు అందచేసే సేవలు, యాప్ లో అనుమతిని ఏవిధంగా అప్లోడ్ చెయ్యాలి, అందుకు అనుగుణంగా చేస్తున్న సూచనలపై డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచీ సమాచారం తెలుసుకున్నారు. సువిధా యాప్ లో డేటా ఎంట్రీ నమోదు చేయడం, తదుపరి దరఖాస్తు స్వీకరణ, అందచెయ్య వలసిన ధృవ పత్రాలు, నామినేష్లను దాఖలు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందనీ అన్నారు.

కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన నమూనా ఈ వి ఎమ్ కేంద్రాన్ని సందర్శించిన ఓటర్ల కు , ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఓటు వేసిన తదుపరి వి వి ప్యాడ్ లో ఎవరికీ ఓటు వేసామో తెలుసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందనీ అన్నారు. ఈ వి ఎమ్ పరికరం పై మరింత ఎక్కువగా ఓటర్లకు అవగాహాన కల్పించడం, ఓటింగు శాతం పెరగడం ఇటువంటి మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *