Breaking News

రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ అనుబంధ విభాగాల పరిశీలన…

-ఆర్వో తేజ్ భరత్

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వారీ కార్యాలయములో ప్రతిపాదించిన ఎన్నికల పర్యవేక్షణ కేంద్రాలు మరియు పోస్టల్ వోటింగ్ కేంద్రంను పరిశీలించడం జరిగిందని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. గురువారం ఉదయం తహశీల్దార్ వారి కార్యాలయము , వై టి సి ప్రాంగణం నందు జాయింట్ కలెక్టర్ సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి అనుబంధ విభాగాలను పరిశీలించడం జరిగిందీ. ఈ సందర్భం గా రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ పరిశీలిస్తూ , రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఎన్నికల సిబ్బంది విధులను నిర్వర్తించడం కోసం అందుబాటులోకి సెక్షన్లు గుర్తించడం జరిగిందన్నారు. అందరూ కూడా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహించడం, జవాబు దారీతనంతో కూడి విధులను నిర్వర్తించడం ప్రారంభించాలని స్పష్టంగా చేశారు. ఎన్నికల నిమిత్తం సమావేశాలు నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ రూమ్ ను , సి విజిల్ (cVIGIL), ఎమ్ సి సి, సువిధ, తదితర కేంద్రాలను పరిశీలించడమైన దన్నారు. ఈ సమావేశంలో రూరల్ తహసీల్దార్ సహాయ రిటర్నింగ్ అధికారు లు వై వికే అప్పారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *