ప్రకటనల జారీ కి 48 గంటల ముందు అనుమతి తప్పని సరి

-ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శన, రేడియో లో ప్రసారం కోసం ముందస్తు అనుమతి ఉండాలి
-జిల్లా ఎన్నికల అధికారి డా మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఎంతో బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహించడం, ప్రచార సారుప్యత పైన ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అనుమతులు ఇవ్వవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ లో గురువారం కలెక్టర్ అధ్వర్యంలో “ఎమ్ సీ ఎమ్ సీ ” కమిటీ తొలి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిని అనుసరించి వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చెయ్యడం జరుగుతుందనీ అన్నారు. ముఖ్యంగా మూడు అంశాల గురించి ఎమ్ సీ ఎమ్ సి కమిటి దృష్టి పెట్టడం చాలా కీలకం అన్నారు. అనుమతి తీసుకుని ప్రచురించిన, ముందస్తుగా అనుమతి లేకుండా ప్రచురించిన, రాజకీయ పార్టీలు లేదా అభ్యర్ధులు ఇచ్చిన ఫిర్యాదులకు చెంది ప్రింట్ మీడియా లో ప్రకటనలు , ఎలక్ట్రానిక్ మీడియా లో , సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటినీ గమనించాల్సి ఉంటుందన్నారు. ఆయా ప్రకటనలు, ప్రచార అంశాలు చెల్లింపు వార్తలు, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ఉల్లంఘన, ఖర్చుల వివరాలు ఆయా బృందాలకు నివేదికలను అందచెయ్యల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు కనీసం 48 గంటల ముందుగా అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని మాధవీలత పేర్కొన్నారు. ఆమేరకు నిర్ణీత ఫారం – ఏ ద్వారా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకున్న తదుపరి, సంభందిత పత్రాలు అందచేయాలన్నారు. ఎమ్ సి ఎమ్ సీ ఆధ్వర్యం లో పరిశీలనా చేసి ధృవ పత్రం ఆయా అభ్యర్థుల పేరుమీద జారీ చేస్తారని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేసే ప్రకటనలు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తెలియ చేశారు. ప్రసారం చేసే వీడియో కంటెంట్‌లను గుర్తించడానికి, కంటెంట్‌లను నిశితంగా పరిశీలించి నిర్దారణ చెయ్యడం, తదుపరి మాత్రమే అనుమతులు ఇస్తామన్నారు.

ఆయా పత్రికలు, ఛానళ్ళు, రేడియో, ఎఫ్ ఎమ్ చానల్స్, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటినీ నిశితంగా పరిశీలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని విధి విధానాలను అనుసరించిన తర్వాత పత్రికలు , ఛానెల్ యొక్క ప్రామాణిక రేట్ కార్డ్‌ల ప్రకారం ఖర్చులను అభ్యర్ధుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికలు జరిగే రోజున, అంతకు ముందు రోజున ఎటువంటి ప్రకటనలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడానికి వీలు లేదని, ఆమేరకు రాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు, మీడియా వారికీ, ప్రింటర్స్ కి అవగాహాన కల్పించడం, సందేహాలు నివృత్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయకుండా ఉండటానికి ప్రింట్ మీడియా ద్వారా ఎలాంటి అభ్యంతరకరమైన లేదా తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రకటనలను నివారించడానికి ఎమ్ సి ఎమ్ సి విభాగం కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

రాజకీయ పార్టీ లేదా అభ్యర్ధి ఇచ్చే ప్రకటనలకు చెందిన వ్యవధి, విషయం/ప్రకటనతో పాటు ప్రచురణకర్త పేరు మరియు చిరునామా తప్పకుండా ఉండాలని మాధవీలత పేర్కొన్నారు.

చెల్లింపు వార్తలు కి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలపై రేట్ కార్డు మేరకు ఖర్చును అంచనా వేసి, అభ్యర్ధుల ఖర్చుల కింద నమోదు చేయడం జరుగుతుంది అని తెలియ చేశారు.

ఈ కమిటి సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, రాజమండ్రీ పార్లమెంటు సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్. కృష్ణ నాయక్, సమన్వయ కర్త జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్. శ్రీనివాస్, సభ్యులు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఇంఛార్జి కెవిఎస్ఎమ్ మూర్తి, ఆర్ట్స్ కళాశాల సహాయ ప్రొఫెసర్ బీ. సునీల్ కుమార్, సహయ కార్మిక కమీషనర్ బీ ఎస్ ఎమ్ వలీ , ఏవో బి వి ఎస్ రామారావు, పిఆర్వో ఎమ్..లక్షణా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *