రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నియోజక వర్గ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం నందు కోలమూరు గ్రామ పంచాయతీ లో ప్యాక్ సొసైటీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం-40 ను అధికారులతో కలిసి జేసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , కోలమూరు గ్రామ పంచాయతీ సచివాలయం-1 నందు వున్న ప్రాధమిక వ్యవసాయ సహకార పరతి సంఘం భవనం లో ఉన్నటువంటి 40 వ పోలింగ్ స్టేషన్ నెం-40 కేంద్రాన్ని పరిశీలించ డమైనదన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద బూత్ స్థాయి అధికారి పేరు, ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలని, ఆమేరకు అక్కడ గోడపై ప్రస్ఫుటంగా కనిపించేలా పేయింట్ చెయ్యాలని ఆదేశించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలని సజావుగా నిర్వహించే క్రమంలో పలు పోలింగ్ స్టేషన్ లను పరిశీలిస్తూ కోలమూరు గ్రామ పంచాయతీ లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్-40 ను సందర్శించడం జరిగిందన్నారు.
సందర్శన సమయంలో పోలింగ్ స్టేషన్ బూత్ స్థాయి అధికారి కె. నిఖిత తో మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ లో ఉండవలసిన కనీస అవసరాలను, ఇతర సౌకర్యాలను ఏ విధముగా ఏర్పాటు చేస్తున్నమో వివరించడం జరిగింది. ఈ పొలింగ్ కేంద్రం పరిధిలో 85 ఏళ్లు దాటిన ఓటర్లు, 40 శాతం పైబడిన ఓటర్ల వివరాలు సేకరించి, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోం ఓటింగు కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు. ఈ పర్యటన లో తహసీల్దార్ వై.కె.వి.అప్పారావు , జిల్లా సహకార సంఘం అధికారి వై. ఉమా మహేశ్వర రావు, బి ఎల్ వో కే.నిఖిత తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News