Breaking News

రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…

-గుడివాడ నాలుగవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే నాని….
-వీధి వీధినా ఎమ్మెల్యే నానికు అపూర్వ స్వాగతం పలికిన ప్రజానికం….
-కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం….
-వన్ టైం సెటిల్మెంట్ ద్వారా టిడ్కో ఫ్లాట్ల రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది…..సీఎం జగన్ దని ప్రకటించిన ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం రెండవ రోజుకి చేరుకున్నాయి. పట్టణంలోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు నాలుగో వార్డు శ్రీరాంపురంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు గజ మాలలతో ఘనస్వాగతం పలికారు. శ్రీకృష్ణ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని, వైసిపి నాయకులు రావులకొల్లు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, వీధి వీధినా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు వివిధ రూపాల్లో ప్రజానీకం తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్నారు. పర్యటనలో భాగంగా మార్కెట్ సెంటర్ వద్ద చిరు వ్యాపారులు ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తమ సమస్యలు తీసుకురాగా, ఎన్నికల అనంతరం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వార్డులో శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం, శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో అబివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చటించారు.
పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. టిడ్కో లబ్ధిదారులు అభద్రతతో ఉండాల్సిన అవసరం లేదని,లబ్ధిదారులేవరు లోన్ కట్టాల్సిన అవసరం లేద….. మీ ఇంటి జోలికి ఎవరూ రారని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ దని,14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి…. పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ చేశారు.2004నుండి2019 వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో మాకు ఇల్లు స్థలాలు లేవని….. మాకు పెన్షన్లు రావడంలేదని వృద్ధులు, వితంతువులు అడుగుతూ ఉండేవారని ఎమ్మెల్యే నాని అన్నారు. తాము పర్యటించిన మూడు వార్డుల్లో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని, పెన్షన్లు రావడంలేదని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరని ఆయన చెప్పారు.సీఎం జగన్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అర్హత ఉండి తమకు అందలేదు అని అడిగే వారు ఒక్కరు కూడా లేరని ఎమ్మెల్యే నాని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం,గద్దె పుస్పరాణి, వైస్ ఎంపీపీ బొట్టు నాగలక్ష్మి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు డోక్కు రాంబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, ట్రేడ్ యూనియన్ నాయకులు తులిమిల్లి యషయ్య పార్టీనాయకులు రావులకొల్లు మల్లేశ్వరరావు, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, రావులకొల్లు హైమావతి, వెంపల అప్పారావు, వెంపటి సైమన్, షేక్ సయ్యద్,జోగా సూర్యప్రకాష్ రావు, నైననవరపు శేషుబాబు, చుండూరి శేఖర్, కోంకితల ఆంజనేయ ప్రసాద్, అగస్త్యరాజు కృష్ణమోహన్, రమణ కుమార్, కృష్ణ కిషోర్ , వీరిశెట్టి నరసింహారావు, తోట శివాజీ,జోగా సూర్యప్రకాష్ రావు, జ్యోతుల శ్రీను,జ్యోతుల సత్యవేణి,చుక్కా నాగలక్ష్మి,దారం నరసింహారావు, మోండ్రు వెంకటేశ్వరరావు, లోయ వరాలు, మాదాసు వెంకటలక్ష్మి,లోయ రాజేష్, మందాడి శ్రీను, నల్లమోతు జగదీష్, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు మహేష్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు మహేష్, కలపాల కిరణ్,గానుగుల ఆనందమురళి, అడపా పండు, చందరాల హరి రాంబాబు, తోట రాజేష్, గుదే రవి, పూడి సుధాకర్, మూడేడ్ల రామారావు,ఆర్కె, తోట సాయి, జ్యోతుల మణికంఠ,జూనియర్ జమదగ్ని,బొండాల శ్రీను, అసిలేటి అర్జునరావు, గంటా శ్రీను, ఘంటా సురేష్,అవుల నరేంద్ర, అల్లం రామ్మోహన్రావు, అడబాల అప్పారావు,దుడ్డు చిన్నా,గొల్ల సోమేశ్వరరావు, జహృద్దిన్, ఖాదర్ బేగ్, సత్తిరెడ్డి, గంటా చంద్రశేఖర్,రజాక్ భాష,పెద్ది రమణ,పిడుగు శ్రీను, చౌటపల్లి కళ్యాణ్, వినోద్, మామిళ్ల ఎలీషా,పుల్లేటికుర్తి కృష్ణ,తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి,తులిమిల్లి యషయ్య వంగపండు బ్రహ్మాజీ, తోటా నాగరాజు, కందుల నాగరాజు, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి బెనర్జీ, సర్దార్ బెగ్, రవి స్వీట్స్ మోహన్, ఎండి యాకూబ్,అబ్దుల్ రహిం, ఎండి సాలెహా,కొండపల్లి శ్రీనివాసరెడ్డి, క్రేన్ బాబి,కంచర్ల జగన్,బలుసు జితేంద్ర, దేవరపల్లి కోటి, లోయ కన్నా, పసలాది శేఖర్,మచ్చా పద్మ,పెద్ద అవు,4వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు మూడేడ్ల ఉమా, చుండి బాబి, వెంకటనారాయణ రెడ్డి, ద్రోణాదుల రామకృష్ణ, వెంకటేశ్వరరావు, కొచ్చర్ల అనిల్, పొదిలి వెంకటేశ్వరరావు, కొచ్చర్ల రాధాకృష్ణ, చుండి డార్జిలింగ్, దుర్గారావు, కొఠారి జైన్,బాల, క్యాటరింగ్ బాలు,ఏల్చూరి సుబ్బారావు,రావులకొళ్లు శ్రీనివాస రావు,ఏడుకొండలు,నున్న గణేష్ బాబు, దొండపాటి కృష్ణా రావు,కల్వగుంట శ్రీనివాస రావు, పరుశురాం, సురేష్,సెగ దుర్గారావు,హర నాధ్, నైనాల వెంకట్రావ్, నగిరెడ్డి దుర్గారావు,గుంటుపల్లి ప్రభాకర్, సబ్బాని రంగారావు, ముడెడ్ల శ్రీను,గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి

-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *