ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆదివారం లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు మరియు హిందూ ధర్మప్రచార నిమిత్తం ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు సమక్షంలో నగరోత్సవ కార్యక్రమం వైభవముగా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగముగా మల్లిఖార్జున మహామండపం వద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించగా, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు టెంకాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ నగరోత్సవ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ మంగళ వాయిద్యములు, కోలాటలు, చిన్నారుల ఆదిశంకరాచార్యుల వారి రూపములు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ మల్లిఖార్జున మహామండపం నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, కెనాల్ రోడ్, వినాయక స్వామి గుడి, కెనాల్ రోడ్, దుర్గ ఘాట్ మీదుగా తిరిగి కొండ పైకి చేరెను. అనంతరం వీరుఅందరికీ అమ్మవారి దర్శనం కల్పించగా ఈవో ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమము నందు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద శర్మ, వేదపండితులు, వైదిక సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News