రానున్న ఎన్నికలలో ఎన్‌డిఎ, చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను కలిపి ఓడిస్తాం!… : మాదిగ సంఘాలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నికలలో ఎన్‌డిఎ, చంద్రబాబు, మంద కృష్ణమాదిగను కలిపి ఓడిస్తామని మాదిగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం గాంధీనగర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌నందు ఆంధ్రప్రదేశ్‌లోని 25 మాదిగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం లిడ్‌ క్యాబ్‌ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ సభాద్యాక్షతన నిర్వహించడం జరిగింది. మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, గ్రంధాలయ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, నవ్యంధ్ర ఎమ్మార్పీఎస్‌ పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, మేదర సురేష్‌కుమార్‌ ఎపి ఎమ్మార్పీఎస్‌ జెఎసి అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్‌ ఉసురుపాటి బ్రహ్మయ్య, ఎపి ఎమ్మార్పీఎస్‌ డి.సువర్ణరాజు, మాదిగ కార్పొరేషన్‌ సాధన సమితి చెరుకూరి కిరణ్‌, కొరిటిపాటి ప్రేమకుమార్‌, మహాసేన, మందా కృష్ణయ్య, వేజెండ్ల సుబ్బారావు, విజయవాడ నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బూదాల శ్రీను తదితర 25 మాదిగ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏక తీర్మానం చేయడం జరిగింది. మాదిగల్ని చంద్రబాబుకి తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని, వర్గీకరణ విషయాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుకి మందకృష్ణ మాదిగ అమ్ముడుపోయి ఆంధ్రప్రదేశ్‌ మాదిగల్ని అంబేద్కర్‌ వాదం నుంచి మనువాదం వైపు నడిపించాలనే మంద కృష్ణ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని త్వరలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాదిగల అభివృద్ధికి కావాల్సిన అంశాలను చర్చించి మా మాదిగ సంఘాల భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం బాపిరాజు ఇన్‌ఫోమ్‌, బూదాల సలోమి, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నలకుర్తి రమేష్‌, జమ్మలమూడి మార్క్‌, గోనుగుంట్ల విల్సన్‌, బుల్లా మేరీకుమారి, పెద్ద సంఖ్యలో మాదిగ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కొండంత అండగా ఉంటా

-వంద రోజుల్లో ప్రధాన సమస్యల పరిష్కారం -22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు-ఆన్ లైన్ లో ప్రోగ్రెస్ రిపోర్టులు -వైసీపీ దుష్ప్రచారాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *