సుజనాకు జై కొట్టిన ఎమ్మార్పీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాలు. ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరూ మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. సుజనా ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాల, మాదిగలకు నిధులు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని, దళితులను బానిసలుగా చూశారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్వాయి దాస్, సుబ్బారావు, నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *