-చంద్రబాబు దుర్బుద్ది, కుళ్లుబోతుతనంతో పెన్షన్స్ ఆపారు
-పేదవారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం – పెత్తందారుల ప్రభుత్వం టీడీపీది
-సెంట్రల్ టీడీపీ అభ్యర్థి ఒక తాగుబోతు, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి
-ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్దుడైన వెలంపల్లి 25వేల మెజారిటీతో గెలుస్తారు – ఎంపీ కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 30వ డివిజన్ దేవీనగర్ పరిధిలో కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ప్రాంతమంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కి, ఆయన అందించిన పథకాల పట్ల అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ – సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా సుమారు 70 రోజుల నుంచి నియోజకవర్గంలో ప్రతి గడపకు తిరుగుతూ, ప్రతి ఒక్కరి నుంచి ఆశీస్సులు, మన్ననలు పొందుతూ – ప్రజలే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ, సమస్యల పరిష్కారం దిశగా చొరవ, ఆయనకున్న సమర్థత వల్ల ప్రజలే వెలంపల్లి ని గెలిపించబోతున్నారు చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితో పెన్షన్లను ఆపారన్నారు. మండుటెండలో పెన్షన్ల కోసం నిలబడి ఈ రోజు 80 ఏళ్ల పెద్దావిడ చనిపోయిన ఘటన చాలా బాధాకరం – దీనికి కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్లే. వృద్దులు, వికలాంగుల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మీద విషం కక్కుతున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు. సమాజానికి సేవ చేసుకునే ఒక గౌరవప్రదమైన హోదాను కల్పించిన వాలంటీర్ల పై అనునిత్యం అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదరికం అన్ని రకాలుగా నిర్మూలించాలని ప్రయత్నిస్తుంటే – కుళ్ళు బోతుతనంతో వ్యవహరిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లన్నారు. ఇక్కడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక తాగుబోతు, ఒక రౌడీ, ఒక గుండా, స్వతంత్ర సమరయోధులు భూములను కబ్జా చేసిన వ్యక్తి, అనేకమంది మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా 25 వేల మెజారిటీతో వెలంపల్లి శ్రీనివాస్ ని గెలిపించబోతున్నారన్నారు. పేద మధ్యతరగతి వారికి విద్య వైద్య నివాసాలలో మెరిగిన వసతులు కల్పిస్తుంటే తట్టుకోలేక ఫేక్ వార్తలను అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. పేద, మద్య తరగతి వారి కోసం పనిచేసేది జగన్ ప్రభుత్వం – పెత్తందారుల కోసం పని చేసేది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు అమరావతి అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు – అన్ని టెంపరరీ బిల్డింగ్లు మాత్రమే నిర్మించాడన్నారు. జగన్ మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు – జగన్ పాలసీకి మేమంతా మద్దత్తు తెలిపామన్నారు. పేదవారిని ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడితే ఉరుకునే ప్రసక్తి లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని పెత్తందారులకు హితవు పలుకుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ఇంచార్జ్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ హోదాల్లో వైయస్సార్సీపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.