తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పండుగలు పరమత సహనానికి ప్రతీకలు.. ఇఫ్తార్ విందులు ఐక్యతకు నిదర్శనం. రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. భారతీయ సంస్కృతి లో పండుగలు, ఆచారల సంస్కృతి సంప్రదాయాలను చాటిచెబుతాయని జనసేన బిజెపి బలపరిచిన విజయవాడ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చెప్పారు. బుధవారం తిరువూరు పట్టణంలోని షాది ఖానా నందు ముస్లిం మైనార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేశినేని శివనాథ్, తిరువూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తిరువూరు టౌన్ 17వ వార్డ్ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుస్సేన్ రెండు వేల మందికి ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయటం జరిగింది. ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు శివనాథ్, శ్రీనివాస్ స్వయంగా ఇఫ్తార్ విందు వడ్డించి దీక్ష విరమింప చేశారు.ఈ సందర్బంగా శివనాథ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనటం చాలా ఆనందం వుందన్నారు…అందరిపై అల్లా ఆశీస్సులు వుండాలంటూ.. ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి హసన్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ముస్తఫా, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఉమర్, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, తిరువూరు మున్సిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ కరీం. షహీన్ పాషా, రాజ్ అహ్మద్ హనీలతో పాటు బిజెపి, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.