Breaking News

విద్యార్ధులు ఆరోగ్యం గా వుంటేనే విద్యపై శ్రద్ధ…

-రక్తహీనత నినారించేందుకే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణి.
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై శ్రద్ద చూపుగలుగుతారని రక్త హీనత నివారణకు అందించే ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను పిల్లలకు క్రమం తప్పక ఉపయోగించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కోరారు. స్థానిక పటమట లోని కోనేరు బసవ పున్నయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టటం జరుగుతుందన్నారు. విద్యార్థినిలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి అనీమియా శాతాన్ని నమోదు చేసి రక్తహీనతను నివారించేందుకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 947 కేంద్రాల ద్వారా 5,23,188 పింక్ కలర్ చిన్న మాత్రలు, 9,24,973 బ్లూ కలర్ పెద్ద మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు .మధ్యాహ్న భోజనం అనంతరం ఐరన్ మాత్రలు తీసుకునేలా ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన మాత్రల ఫలితంగా విద్యార్థులలో రక్తహీనత శాతం క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించే నేపథ్యంలో మాత్రల వాడకం నిరంతరంగా జరగాలనే ఉద్దేశంతో ఆరు వారాలకు సరిపడ ఐరన్ అండ్ పోలిక్ యాసిడ్ మాత్రలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి క్రమం తప్పకుండా వినియోగించేలా చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. మహిళలు గర్భందాల్చిన నాటి నుండే పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన శిశువుల జననానికి చర్యలు తీసుకోవడం, కిశోర బాలికలకు అవసరమైన సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా భవిష్యత్ లో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మింపచేయలన్నదే లక్ష్యం అన్నారు. పంపిణీ చేసిన ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పక వినియోగించి పాఠశాలల పున:ప్రారంభం నాటికి విద్యార్థు లు మరింత ఆరోగ్యవంతులై విద్య పట్ల శ్రద్ద చూపేలా తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహాసిని, ఆర్బిఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. జి. మాధవి, విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కెవి ఎల్ ఎన్ కుమార్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ సాగర్ డి పి ఎం ఒ డా.నవీన్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.నీహారిక డా.ఉస్మాన్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *