– వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టి ఏం సాధించారు
– ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చే పగటి వేశగాళ్లతో జాగ్రత్త
– స్థానికంగా అందుబాటులో ఉండేవారినే గెలిపించాలి
– సుజనా చౌదరి ధనరాజకీయాలు ఇక్కడ చెల్లవు
– వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్కళ్యాణ్లకు వృద్ధులు, దివ్యాంగుల ఉసురు కచ్చితంగా తగులుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం జగనన్న ప్రభుత్వంపై కక్ష, వలంటీర్లు అంటే భయంతోనే కుట్రపన్ని తమ మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించారని, దానివల్ల వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటివారు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిసినా.. కేవలం తమ రాజకీయ స్వార్థంతో సుమారు 60లక్షల మంది అవ్వతాతలు, దివ్యాంగులు, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను చంద్రబాబు అండ్ కో ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆయన బుధవారం 55వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ తాము ఏ ఇంటికి వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమకు పింఛను వస్తుందా… రాదా.. అని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసిన కుట్రవల్ల ఎన్నికలు ముగిసేవరకు ఇటువంటి ఇబ్బందులు తప్పవని, జూన్ నెలలో మళ్లీ మన జగనన్న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బందీ లేకుండా పింఛన్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకువచ్చి యథావిధిగా అందిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో సుజనా చౌదరి వంటి పగటి వేషగాళ్లు డబ్బు మూటలతో వస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తన బినామీ అయిన సుజనా చౌదరిని కూటమి మాటున ఎన్నికల్లో పోటీకి దింపారని తెలిపారు. సుజనా చౌదరి ధనరాజకీయాలు ఇక్కడ చెల్లవని స్పష్టంచేశారు. ఎన్నికలు అయినపోయిన తర్వాత ఢల్లీి, హైదరాబాద్ వెళ్లిపోయే సుజనా చౌదరి వంటివారిని ప్రజలు నమ్మబోరన్నారు. స్థానికంగా నిరంతరం అందుబాటులో ఉంటూ, పదవిలో ఉన్నా.. లేకపోయినా… నిరంతరం ప్రజలకు తనవంతు సేవలు అందిస్తున్నానని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆసిఫ్ కోరారు. ఐదేళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు యథాతథంగా ప్రజల ఇంటి వద్దకే రావాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ గెలిస్తే గతం రెండు రోజులుగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రెండు రోజులుగా పడుతున్న కష్టాలను ఐదేళ్లు అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ శీరంశెట్టి పూర్ణచంద్రరావు, నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News