విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న “డయల్ యువర్ పోలీస్ కమీషనర్” కార్యక్రమం శుక్రవారం నిర్వహించబడును. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. తో నేరుగా ప్రజలు మాట్లాడేందుకు ప్రతి శుక్రవారం “డయల్ యువర్ పోలీస్ కమీషనర్ కార్యక్రమం” రేపు అనగా ది.12-04-2024 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించబడును. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0866-2490613 నెంబర్ కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలును నేరుగా పోలీస్ కమీషనర్ కి తెలియజేసుకోవచ్చు.
ఎన్.టి.ఆర్.జిల్లా నందు జరుగు పోలీస్ సంబంధిత సమాచారం తెలుసుకొనుటకు మరియు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు లేదా సమాచారం అందించాలనుకునే వారు ఈ క్రింది తెలిపిన సోషల్ మీడియా లింకులు ద్వారా చేయవచ్చు.
Facebook – https://www.facebook.com/VjaCityPolice
Twitter- https://twitter.com/VjaCityPolice
Instagram – https://www.instagram.com/vijayawadacitypolice/