-తొలి రోజు పార్లమెంటు నియోజక వర్గ ఈ వి ఎమ్ ల రాండమైజేషన్
-జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో రాండమైజేషన్
-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ వారి సూచనలు మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో వినియోగించే ఈవీఎమ్ ల మొదటి రాండమైజేషన్ ను షెడ్యూలు మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.
శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం లోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ ప్రక్రియని స్వయంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ – నలబాటి రమేష్ (శ్యామ్) , టిడిపి – సిహెచ్. శ్రీనివాస రావు , సలాది ఆనంద్, బిజెపి – జి. వెంకట రావు, వైయస్ఆర్ సీపీ – వై వి ఎస్ శ్యామల, ల సమక్షంలో కలెక్టర్ పరిశీలించడం, కేటాయింపు ప్రక్రియ పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఏప్రియల్ 12 , 13 తేదీల్లో రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆప్రక్రియ లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ల రాండమైజేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. తొలుత రాండమైజేషన్ కి సంభందించి అనుసరిస్తున్న విధానం పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర సమాచారాన్ని అందచేశారు. జిల్లా స్ట్రాంగ్ రూం సెంటర్లో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ స్కానింగ్ పనులు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో భద్రపరచిన జిల్లాకు కేటాయించిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,463 కంట్రోల్ యూనిట్స్, వివిపాట్ యూనిట్స్ 4,927 లను సాంకేతికంగా తనిఖీ చేసి, వాటి పని తీరును నిర్ధరణ చెయ్యడం ఆయా యూనిట్స్ పనితీరు పై కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక ఇచ్చినట్లు తెలియ చేశారు.
ఒక్కో ఈ వి ఎమ్ భద్రపరిచే బాక్సులో 10 యూనిట్స్ ఉంటాయని, వాటినీ ఒక టేబుల్ వద్ద కేంద్రీకృతం చేసి , ఒక్కో యూనిట్ ఒక్కో అసెంబ్లి నియోజక వర్గానికి చొప్పున 7 నియోజక వర్గాలకు కేటాయించి, వాటికి సంబంధించిన సీరియల్ నంబర్ల ను స్కానింగ్ చెయ్యడం జరుగుతుందనీ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత అన్నారు. ప్రతి నియోజక వర్గానికి యూనిట్స్ అలాట్ చేసిన తర్వాత, వాటినీ ఆయా నియోజక వర్గాల స్ధాయిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు జిపిఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా అత్యంత భద్రత మధ్య పంపించడం జరుగుతుందని తెలియ చేశారు. ఈరోజు పార్లమెంటు కి సంబంధించిన ఈవీఎమ్ రాండమైజేషన్ చెసి ఆయా నియోజక వర్గాల కు తరలించనున్నట్లు తెలిపారు. ఆయా నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ వద్ద రిటర్నింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా, సి సి టివి లు, అగ్నిమాపక భధ్రత చర్యలు, విజిటర్స్ పుస్తకం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను,మార్గదర్శకాలను అనుసరించి రిటర్నింగ్ అధికారులు ఈవీఎం గోడౌన్లో మొదటి రాండమైజేషన్ పనులను పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఇందు కోసం ఆయా నియోజక వర్గాల నుంచి 11 మంది స్టాఫ్ నియమించామన్నారు. ఆయా నియోజక వర్గాల వారీగా కేటాయించిన సీయూలు, బీయూలు, వీవీప్యాట్లను నియోజక వర్గాల వారీగా అందజేయాలని ఈ వి ఎం ల నోడల్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ని కలెక్టర్ ఆదేశించారు.
రాండమనైజేషన్ కార్యక్రమంలో రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్.వి.రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంటు సహయ రిటర్నింగ్ అధికారి – ఎస్.డి.సి. ఆర్.కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.