-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్యా సంవత్సరం 2024-25కు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News