Breaking News

మొదటి విడత ఈవిఎం, వివిప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటి విడత ఈవిఎం, వివిప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా పూర్తి అయిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఈవిఎం ర్యాండమైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టి పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ వారు ఏప్రిల్ 12వ తేదీన ఈవీఎంల బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్స్ ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఈవీఎంలు, వివిప్యాట్స్ ల ర్యాండమైజేషన్ కోసం సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డిఈఓ లాగిన్ నుంచి ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈవీఎంలు, వివిప్యాట్స్ ల మొదటి ర్యాండమైజేషన్ ను చేపట్టామన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ అసెంబ్లీ కి సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు, తిరుపతి పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్, వివి పాట్ లు NIC సాప్ట్ వేర్ నందు ఆన్లైన్ ద్వారా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈవీఎం, వివిప్యాట్స్ యంత్రాలు తరలించే వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ ఉంటుందని, సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం పటిష్ట పోలీస్ బందోబస్తుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం, వివిప్యాట్స్ యంత్రాలను పంపిస్తామన్నారు. ఈవీఎంలు, వివిప్యాట్స్ ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంలు, వివిప్యాట్స్ ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓలు అదితి సింగ్, నిషాంత్ రెడ్డి, చంద్రముని, కిరణ్ కుమార్, రామ్మోహన్, నరసింహులు తదితర అధికారులు, టిడిపి నుండి మనోహరాచారి, వైఎస్ఆర్సిపి చంద్ర శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *