విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డాక్టర్ జంధ్యాల మహతీశంకర్ రచించిన పద్య మంజరి, డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు రచించిన బుద్ధుని బోధనలు-జాతక కథలు, కవి సమ్మేళనం జరిగింది. రసభారతి సాహితీ సంస్థ, గోళ్ళ రాధాకృష్ణమూర్తి, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం డాక్టర్ జంధ్యాల మహతీశంకర్ రచించిన పద్య మంజరి, డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు రచించిన బుద్ధుని బోధనలు- జాతక కథలు, కవి సమ్మేళనం నిర్వహించారు. గ్రంథాలను కవి పండిత పోషకుడు చెట్లపల్లి మారుతీ ప్రసన్నకు అంకితమిచ్చారు. రసభారతి అధ్యక్షుడు పొన్నలూరి లక్షణ రావు సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ క్రోవి పార్థసారథి, డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ మహతీ శంకర్ సాహిత్య సేవలను వివరించారు. నూతన సంవత్సర ఉగాది సందర్భంగా చలపాక ప్రకాష్, డాక్టర్ వెన్నావల్లభరావు, సర్వాశారద స్వీయ కవితా గానం చేశారు. డాక్టర్ పరదేశిబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్య మంజరి గ్రంథాన్ని ఆవిష్కరించిన మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ భాషా సంస్కృతి, సంప్రదాయాల కృషికి సాహిత్య సంస్థలు, ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. జాతి మనుగడలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. బహుముఖ ప్రతిభాశాలి సాహితీవేత్త జంధ్యాల మహతీ శంకర్ గా అభివర్ణించారు. జాతక కథలు గ్రంథాన్ని గోళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహనీయుడు గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సభ్యులు, సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …