గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏసి కాలేజిలో ఈవిఎంల స్ట్రాంగ్ రూమ్ ల ను ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్దం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయిన ఏసి కాలేజిలో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఈవిఎంల డిస్ట్రిబ్యూషన్ ఏసి కాలేజిలో జరుగుతుందని, కాలేజిలో ఈవిఎంలు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ లను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలేజి మెయిన్ గేటు నుండి స్ట్రాంగ్ రూమ్, పరిసరాలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సిసి కెమెరాల సెంట్రల్ మోనిటరింగ్ విభాగం అబ్జర్వర్ రూమ్ లో ఉండాలని, సిసి కెమెరాల రికార్డ్ ను ప్రత్యేకంగా హార్డ్ డిస్క్ లో ఏరోజుకి ఆరోజు స్టోర్ చేయాలని, రికార్డింగ్ లో ఏవిధమైన విద్యుత్, సాంకేతిక లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఏఈ భాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాలను పరిశీలించి, వర్షం వస్తే నీరు లోపలకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఏఈకి, రూమ్ లో ప్రతి ఈవిఎంకు తగిన మార్కింగ్ ఇవ్వాలని సర్వేయర్ ని ఆదేశించారు.
పర్యటనలో ఏఆర్ఓలు సునీల్, ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూధన్, ఈఈలు సుందర్రామిరెడ్డి, శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …