Breaking News

అధికారులు విధుల పట్ల సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియలో స్టాటికల్ సర్వ్లెన్స్ బృందాల పాత్ర కీలకమని, విధులు కేటాయించబడిన అధికారులు విధుల పట్ల సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ & ఆర్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ స్టాటికల్ సర్వ్లెన్స్ బృందానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మేంట్ సిస్టం పై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం పరిధిలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు చేసే ప్రచార ఖర్చుల రికార్డింగ్ స్టాటికల్ సర్వ్లెన్స్ విధుల్లో కీలకమన్నారు. స్టాటికల్ సర్వ్లెన్స్ బృందంలో విధులు కేటాయించబడిన ప్రతి అధికారి సీజర్ మేనేజ్మెంట్ సిస్టం పై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. సీజర్, పంచనామా తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు, సీనియర్ అధికారుల ద్వారా శిక్షణ అందిస్తామని తెలిపారు. అలాగే సీజర్ మేనేజ్మెంట్ సిస్టం ఆన్ లైన్ యాప్ లో ప్రతి వివరం పొందుపరచాలన్నారు. శిక్షణలో ఏఆర్ఓ సునీల్, సెక్టోరల్ అధికారి శ్రీధర్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం వెంకట లక్ష్మీ, తూర్పు నియోజకవర్గ స్టాటికల్ సర్వ్లెన్స్ బృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *