Breaking News

జగన్ అబద్ధం, చంద్రబాబు నిజం..రెండు నెలల్లో నిజం గెలవబోతుంది

-టి.డి.పి. ఎం.పి అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని)
-తిరువూరులో నిజం గెలవాలి ముగింపు సభ
-కదిలివచ్చిన మహిళ లోకం
-మహిళలతో నిండిన పోయిన సభా ప్రాంగణం
-సభా ప్రాంగణంలో మారుమోగిన నిజం గెలవాలి నినాదం

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక ఛాన్స్ అడిగిన జగన్ కి ముందే తెలుసు …నెక్స్ట్ టైమ్ ప్రజలు తనని గెలిపించారని…అందుకే ఒక ఛాన్స్ అన్నాడు..ఆ దుర్మార్గుడికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ బాధ పడుతున్నారు.. ఆ పొరపాటును సరిచేసుకునేందుకు రాబోయే ఎన్నికల కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. జగన్ అబద్ధం, చంద్రబాబు  నిజం అని బిజెపి జనసేన బలపరిచిన టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తిరువూరు లోని దారా పూర్ణయ్య టౌన్ షిప్ గ్రౌండ్ లో శనివారం సాయంత్రం నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి ముగింపు సభ జరిగింది.. ఈ సభకు శివ నాథ్ తో పాటు ఆయన సతీమణి జానకి లక్ష్మి, సోదరి కేశినేని శ్రీదేవి కూడా హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ సభ అధ్యక్షత వహించిన ఈ సభలో శివ నాథ్  మాట్లాడారు. నిజం గెలవాలి పర్యటన, నిజం గెలవాలి ముగింపు సభ కోసం నారా భువనేశ్వరి  తిరువూరుకి రెండు రోజులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అన్న ఎన్టీఆర్ లాగే ఆదుకునే మ‌న‌సు భువ‌న‌మ్మదన్నారు.
దార్శ‌నికుడు చంద్ర‌బాబు లో ఆమె స‌గం..ముఖ్య‌మంత్రి కుమార్తెగా, ముఖ్య‌మంత్రి భార్య‌గా, మంత్రి త‌ల్లి అయినా నిరాడంబ‌ర‌మే భువ‌న‌మ్మ జీవితమని తెలిపారు… ఓ వైపు హెరిటేజ్ బాధ్య‌త‌లు చూస్తూనే, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విద్య‌, వైద్య‌ వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారని తెలియజేశారు

ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో బాధితుల‌కు అందే తొలి సాయం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నుంచే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతారన్నారు.

తండ్రి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేశారు,, భర్త చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి గా పని చేశారు..అయినా ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాలేదు… కేవలం బాబు గారి అక్రమ అరెస్టు కారణంగా స్థాపానికి గురై చనిపోయిన 2003 కుటుంబాలను భరోసా ఇచ్చేందుకే నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా భువనేశ్వరి ప్రజలు మధ్యకు వచ్చారు.బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పించారన్నారు.

జగన్ పాలనలో అదోగతి పాలైనా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్లాలంటే అది ఒక చంద్రబాబు గారితోనే సాధ్యమన్నారు. చంద్రబాబు గెలిస్తేనే నిజం గెలుస్తుందని చెప్పారు. నేటితో మ‌న తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిజం గెల‌వాలి కార్య‌క్ర‌మం ముగిసిందనీ ప్రకటించారు. భువ‌న‌మ్మ కార్య‌క్ర‌మం నిజం గెల‌వాలి… నెల‌రోజుల్లో కూట‌మి విజ‌యంతో నిజం గెలుస్తోందనీ చెప్పారు. నీతికి మ‌రో రూప‌మైన చంద్ర‌బాబు సీఎం అయితే నిజం గెలిచి తీరుతుందనీ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో బిజెపి జనసేన టిడిపి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు కి కానుకగా ఇస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, తిరువూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్, నందిగామ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, కొలికిపూడి మాధవి, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, జనసేన పార్టీ తిరువూరు మండల అధ్యక్షుడు ఎమ్. శ్రీనివాస్ లతో పాటు ఎన్టీఆర్ జిల్లా టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *