వేణు గోపాల స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శనివారం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు వేణు గోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శివ నాథ్ ని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కేశినేని శివనాద్ కి ఘన స్వాగతం పలికాయి.. రాష్ట్ర అభివృద్ధి తో పాటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దబోయే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వేణుగోపాలస్వామిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు..

కేశినేని శివనాథ్ గారి వెంట రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు చెరుకుల రాజేశ్వరరావు, టిడిపి నాయకులు డాక్టర్ జయసింహ, గంపలగూడెం తెలుగు యువత అధ్యక్షులు మానకొండ రామకృష్ణ (ఎమ్.ఆర్.కే), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రాంబాబు, గంపలగూడెం పార్టీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నెమలి గ్రామ పార్టీ అధ్యక్షుడు బెల్లం మధుసూదన్ రావు, వేణుగోపాల దేవస్థానం మాజీ చైర్మన్ వడ్లమూడి రాజశేఖర్, టిడిపి తిరువూరు నియోజకవర్గ , మండల గ్రామ పార్టీ నాయకులందరూ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *