-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం జిల్లాలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల కు నిర్వహించిన తొలి విడత శిక్షణా తరగతులకు 73 మంది గైరాజరు అయ్యారని, వారు ఏప్రియల్ 18 వ తేదీ మ.3 గంటలకి వ్యక్తిగతం గా హాజరై వ్రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే క్రమంలో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగులు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ను ఖచ్చితంగా పాటించాల్సి ఉందన్నారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాల పరిధిలో సోమవారం నిర్వహించిన పీ వో, ఏ పీవో ల తోలి శిక్షణా తరగతులకు 73 మంది హాజరుకాకపోవడం జరిగిందన్నారు. వారు ఏప్రియల్ 18 వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కలక్టరేట్ కు వొచ్చి కలెక్టర్ ముందు వ్యక్తిగతంగా హాజరై ఎందుకు హజరు కాలేదో వ్యక్తిగత వివరణ ఇవ్వాలన్నారు. వారు ఇచ్చిన కారణం సహేతుకంగా, వాస్తవికత లేని ఎడల వారిని సస్పెండ్ చెయ్యడం జరుగుతుందనీ ఆ ప్రకటనలో తెలియ చేశారు.