Breaking News

జిల్లా ఎఫ్ ఎస్ టి బృందంతో సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్ర స్థాయిలో లిక్కర్ లావాదేవీలు, ఇతర ఫ్రీబీస్ పంపిణీల తీరుపై సూక్ష్మ స్థాయిలో నిఘా పెట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం కలక్టరేట్ లోని డి ఈ వో ఛాంబర్ లో జిల్లా ఎఫ్ ఎస్ టి బృందంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో 7 నియోజక వర్గాల స్థాయి లో 63 బృందాలు మూడూ షిఫ్ట్ లలో విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియ చేశారు. వీటికి అదనంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో పదిమంది సభ్యులతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ బృందానికి సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి నోడల్ అధికారిగా నియమించమన్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మరింత ఖచ్చితత్వంతో విధులను చేపట్టాల్సి ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజున లిక్కర్ లకీ సంబంధించిన ఏ రకం ఎంత లావా దేవీలు జరిగాయి, అదే విధంగా వివిధ ఫ్రీబిస్, వస్తువుల వినిమయం ఎంత ఉంది షాపుల వారీగా, ఏరియా వారీగా గణాంకాలు తనిఖీ చెయ్యాల్సి ఉందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, జి ఎస్ టి., ఎస్ ఎస్ టి శాఖలు అధ్వర్యంలో రికార్డులను పరిశీలించి ఆమేరకు చేపట్టవలసి చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లా ఎఫ్ ఎస్ టి బృందాలు తనిఖీలు నిర్వహించిన వాటి వివరాలు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చెయ్యడం అత్యంత అవసరం అని తెలియ చేశారు. జిల్లాలో ఉన్న 5 డిస్టరీలు, ఒక బ్రెవరీ లకు ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలు పై సమగ్ర సమాచారం సేకరించి, అధ్యయనం చేయ్యాలన్నారు. అమ్మకాలను నియంత్రించే క్రమంలో సీలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలియ చేశారు.. ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో సమగ్ర కార్యచరణ రూపొందించడం ద్వారా నియంత్రణా చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతుందని అన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయి ఎఫ్ ఎస్ టీ బృందం ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రణాళికలు, తనిఖీలు జవాబుదారీతనం తో కూడి విధులను నిర్వర్తించడం చాలా ముఖ్యం అన్నారు.

ఈ సమావేశం లో సహాయ కలెక్టర్, డిఎఫ్ఎస్టి నోడల్ అధికారి సి. యశ్వంత్ కుమార్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం. భాను ప్రకాష్ , ఎక్సైజ్ , ఎస్ ఎస్ టి, జి ఎస్ టి , ఇన్కమ్ ట్యాక్స్, తదితర శాఖల కోర్ టీమ్ అధికారులు హాజరయ్యారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *