Breaking News

తొలి రోజున ఒక అభ్యర్ధి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు…

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
066 – గోపాలపురం (ఎస్ సీ) అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక అభ్యర్ధి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చెయ్యడం జరిగిందనీ గోపాలపురం ఎస్సీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఎల్. శివ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. టీడీపీ తరపున మద్దిపాటి వెంకట రాజు, సన్ ఆఫ్ యోహను రెండూ సెట్ల నామినషన్ పత్రాలు దాఖలు చెయ్యడం జరిగిందనీ తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు గోపాలపురం తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *