కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు (ఎస్ సీ) అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఇద్దరు అభ్యర్థులు రెండు నామినేషన్లు దాఖలు చెయ్యడం జరిగిందనీ కొవ్వూరు ఎస్సీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. వైఎస్సార్ సీపీ తరపున తలారి వెంకట్రావు సన్ ఆఫ్ ఏసుదాసు ఒక సెట్టు నామినషన్ పత్రాలు , వైయస్ఆర్ సీపీ తరపున తలారి పరం జ్యోతి వైఫ్ ఆఫ్ వెంకట్రావు ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చెయ్యడం జరిగిందనీ తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరించటం జరుగుతుందని సబ్ కలెక్టర్ కొవ్వూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు.
Tags rajamandri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …