Breaking News

ఎన్నికల వ్యయ పరిమితి మించకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అభ్యర్థుల ఖర్చు ఉండాలి : ఎన్నికల వ్యయ పరిశీలకులు

-ఎన్నికల మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముగ్గురు ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అకౌంటింగ్ పై చేపట్టిన చర్యలపై పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారులతో, నియోజక వర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్ లతో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, మీను ఓలా గారు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించి అభ్యర్థుల అకౌంటింగ్ రికార్డింగ్ పక్కాగా ఉండాలని సూచించారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎక్స్పెండిచర్ అబ్జార్వర్ లు, కలెక్టర్ గారు రిటర్నింగ్ అధికారులతో, నియోజక వర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్, అకౌంటింగ్ టీమ్ లతో, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయానికి సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వివరిస్తూ సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ మేరకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేయడమైనది అని, స్టాటిక్ సర్వైవలేన్స్ టీమ్ లు పని చేస్తున్నాయని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వవలేన్స్ టీమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. సీజర్ జరిగిన వాటిలో పార్టీ ప్రచారాలకు పొలిటికల్ పార్టీ వారికి చెందిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల మేరకు పట్టు బడిన నగదు, విలువైన లోహాలు, ఫ్రీబీ లు ఉన్నాయని, సామాన్య ప్రజానీకానికి చెందిన నగదు సీజ్ చేసిన వాటిని జిల్లా త్రిసభ్య కమిటీ ప్రతి దినం రెండు సార్లు సమావేశం అయి వారి రికార్డులను పరిశీలించి సరియైన పత్రాలు ఉంటే వారి నగదును తిరిగి వారికి విడుదల చేయడం జరుగుతోందని ఇప్పటివరకు 37 కేసులకు సంబంధించి రూ.67.87 లక్షలకు గాను 35 కేసులకు సంబంధించిన నగదు మొత్తం రూ.63.98 లక్షలు తిరిగి వాటి సంబంధీకులకు అప్పగించడం జరిగిందనీ, పెండింగ్ 2 కేసులను రేపు క్లియర్ చేస్తామని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా తేదీ నాడు ఈ నెల 29 న తుది అభ్యర్థుల జాబితా మేరకు అభ్యర్థి వారికి వ్యయాల నిర్వహణకు రిజిష్టర్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు సక్రమంగా నిర్వహణకు అభ్యర్థులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యయ పరిమితి మించి ఖర్చు చేస్తే అనర్హత అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకని సక్రమంగా నిర్వహణ ఉండాలని సూచించారు. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్ లు ఆర్ ఓ లతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఈఆర్ఓ లు, ఎ ఈ ఆర్ ఓ లు, నోడల్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *