-సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ ఈ నెల 25 లోపు తప్పక పూర్తి చేసేలా రోజువారీ సమీక్షతో చర్యలు ఉండాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లతో వర్చువల్ విధానంలో నోడల్ అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఓ లు పెండింగ్ క్లెయిమ్స్ పై త్వరితగతిన ఈ నెల 25 లోపు తప్పక చర్యలు తీసుకోవాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హోమ్ ఓటింగ్, అబ్సెంటి ఓటర్లకు, అత్యవసర సర్వీసులు శాఖల ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ విధివిధానాలను వివరించారు. హోమ్ ఓటింగ్ పై సెక్టరల్ అధికారులు, బిఎల్వో లు బాధ్యతగా పనిచేయాలి అని తెలిపారు. ఎపిక్ కార్డులు రిటర్న్ వచ్చినవి బిఎల్వో ల ద్వారా సంబంధిత ఓటరుకు అందేలా పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోడల్ అధికారులు వారి సంబంధిత విధులు షెడ్యుల్ మేరకు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ, పెంచల కిషోర్, వివిధ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.