ఎన్నికల సందర్భం గా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వ్యయ పరిశీల కులు రోహిత్ నగర్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ తెలియ చేసారు. శుక్రవారం నియోజక వర్గ పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పర్యటించి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల సందర్భంగా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు వ్యయ పరిశీలకులు నిర్వహించారని, అనంతరము ఆర్వో కార్యాలయానికి రావడం జరిగింది.

ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి సంబంధించిన చెక్ పోస్టును, పాలంగి, పెరవలి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. రికార్డులను పరిశీలించి, సూచనలు చెస్తూ, తరచుగా తిరిగే వాహనాలపై నిఘా పెట్టా లని ఆదేశించామన్నారు.

వివిధ వాహనాల రాకపోకలు పై గట్టి నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. నియోజక వర్గం లో ప్రత్యేక నామినేషన్ సెల్ (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశామనీ రమణ నాయక్ వివరించారు. చెక్ పోస్ట్ ల వద్ద ఎక్సైజ్, పోలి స్, అటవీ శాఖ, రెవిన్యూ వివిధ శాఖల ఉద్యోగులు ఆధ్వర్యం లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలు చెసే విధానంలో ఎన్నికల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు నామినేష‌న్లను స్వీక‌రించే గ‌ది లో వీడియో రికార్డు చేయడం జరుగుతుందన్నారు. 55 నిడదవోలు అసెంబ్లీ నియో జకవర్గ నామినేషన్ల ప్రక్రియ పై ఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణ నాయక్ ను రోహిత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, బి. శ్రీనివాస్, లైజిన్ ఆఫీసర్, కే కిషోర్ కుమార్, ఎఈఆర్ఓ లు వి. నాగభూషణం, కే నవీన్ కు మార్, డి.సుధ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *