గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (95) ఓటు ఉండి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 22 (సోమవారం) లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ లో వివరాలు ఇవ్వాలని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కల్గి ఉండి 2024 సాదారణ ఎన్నికల ప్రక్రియలో విధులు కేటాయించబడిన మాస్టర్ ట్రైనర్లు, బిఎల్ఓలు, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ, ఎంసిసి, ఎక్స్పెండీచర్ టీంలు మరియు సదరు టీం లకు కేటాయించిన వీడియోగ్రాఫర్స్, డ్రైవర్ లు ఈ నెల 22 వ తేదీలోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ లో ఫారం-12(2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్, డ్యూటీ ఆర్డర్ కాపి ఇవ్వాలన్నారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది కార్యాలయ పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటారని తెలిపారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …