Breaking News

తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు నామినేషన్లు

-రాజమండ్రి పార్లమెంటుకు ఒక నామినేషన్
-6 అసెంబ్లీ నియోజకవర్గలలో 11 నామినేషన్లు దాఖలు
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటు కు భారతీయ జనతా పార్టీ తరుపున ఒక అభ్యర్థి, ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం బిజెపి పార్టీ తరపున దగ్గుపాటి పురందేశ్వరి నామినేషన్ ను జిల్లా రిటర్నింగ్ అధికారి డాక్టర్ కే మాధవీలతకు అందజేశారు. రాజమండ్రీ అర్బన్ పరిదిలో శుక్రవారం ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్యలేదని తెలిపారు.

మిగిలిన ఆరు నియోజక వర్గాల వారీగా దాఖలు అయిన నామినేషన్ పత్రాలు వివరాలు..
040- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున నల్లమిల్లి మహాలక్ష్మి

049- రాజానగరం నియోజక వర్గంలో

1) వైయస్సార్ సిపి పార్టీ తరఫున
జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్,

2) వైయస్సార్ సిపి పార్టీ తరపున గంధం రాజశ్రీ,

050- రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్లు ఏమియు దాఖలు కాలేదు.

051- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ తరపున గోరంట్ల బుచ్చియ్య చౌదరి,

054- కొవ్వూరు (ఎస్సీ ) నియోజకవర్గంలో
1) తెలుగుదేశం పార్టీ తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు

2)ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరిగెల అరుణ కుమారి,

3) లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొంతా శ్యామ్ రవి ప్రకాష్ లు,

055- నిడదవోలు నియోజక వర్గంలో

1) జనసేన పార్టీ తరపున కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్,

2) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఎ. ఐ. ఎఫ్. బి ) తరపున కస్తూరి సత్యప్రసాద్,

066- గోపాలపురం(ఎస్సీ) నియోజకవర్గంలో

1)వైయస్సార్  సిపి  పార్టీ తరఫున తానేటి వనిత
2) జొన్నకూటి బాబాజీ రావు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *