-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆదివారం అనగా 21- 4- 2024న, మహావీర్ జయంతి సందర్భంగా కబేలా సెలవని ప్రకటించారు. అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఎవరూ మాంసం విక్రయించకూడదు. అందువల్ల ఆదివారం నగరంలో ఎక్కడా నాన్ వెజ్ షాపులు తెరవవు అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని విఎంసీ కమిషనర్ స్వప్నిల్ తెలిపారు. కావున దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. సోమవారం (ఏప్రిల్ 22) అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు యథావిధిగా తెరవవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.