Breaking News

క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలి…

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో పోటి చేసేందుకు అభ్యర్దులు నామినేషన్ లని వెయ్యడం జరిగిందనీ , క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రోహిత్ నగర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్ధులు చేసే ప్రచారం, ర్యాలీలు, వ్యయ లపై పత్యేక దృష్టి పెట్టడం, ఆయా సందర్భాల్లో పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చెయ్యడం పై దృష్టి పెట్టాలని సూచించారు. వాటినీ ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేసేలా హార్డ్ డిస్క్ లో వాటినీ ఈరోజుకి ఆరోజు భద్ర పరుచుటకు ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ సందర్భలలో ఆయా ర్యాలీల పై రాజకీయా పార్టీలు ప్రత్యారోపణలు చేయడం జరుగుతుందని, వాటినీ సమర్థవంతంగా నిజ నిర్దారణ చెయ్యడం లో వీడియో క్లిప్ లు ఎంతో ఉపయోగ పడుతుంది అని పేర్కొన్నారు. ఆమేరకు కార్యచరణ రూపొందించడం పై దృష్టి పెట్టాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *