తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లోని ఎన్నికల ఎంసిఎంసి కంట్రోల్ రూం ను శుక్రవారం జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు విజి శేషాద్రి, మీను ఓల పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా నందు వస్తున్న ప్రకటనలను, పెయిడ్ న్యూస్ లను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు అని ఆరా తీసి పలు సూచనలు చేశారు. మీడియా నోడల్ అధికారి మరియు ఎంసిఎంసి మెంబర్ సెక్రటరీ బాల కొండయ్య వివరిస్తూ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు. వీటికి సంబందించిన రిపోర్టులను రోజువారీగా సంబంధిత ఆర్.ఓ, ఎక్స్పెండి చర్ నోడల్ అధికారి వారికి పంపుతున్నామని వివరించారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు సంబంధించి పెయిడ్ న్యూస్ ను పత్రికలలో, 24X7 టెలివిజన్ లలో మరియు సోషల్ మీడియాలో పరిశీలించడం జరుగుతోందని, అభ్యర్థులకు సంబంధించి గుర్తించిన ప్రకటనల, పెయిడ్ న్యూస్ వ్యయాలను నిర్ధారిత రేట్ల ప్రకారం జమ చేసే విధంగా సంబందిత రిపోర్టులు పంపడం జరుగుతోందని తెలిపారు. అంతే కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి సంబంధిత ఎంసిసి అధికారులకు పంపడం జరుగుతోందని తెలిపారు. అభ్యర్థుల ప్రచారాలకు, ప్రకటనలకు వాడే కంటెంట్ నకు ముందస్తు అనుమతి (ప్రీ సర్టిఫికేషన్) కోసం వచ్చిన ధరఖాస్తులను ఎంసిఎంసి కమిటీ పరిశీలించి ఎంసిసి ఉల్లంఘనలు లేకుండా ఉంటే 48 గంటల లోపల జిల్లా ఎన్నికల అధికారి గారి ఆమోదంతో అనుమతులు ఇవ్వడం జరుగుతోందని వివరించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల వెంట జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ పి.ఆర్.ఓ. ఈశ్వరమ్మ, ఐ అండ్ పిఆర్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సిబ్బంది ఉన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …