తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమం తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయం 1 నందు ఘనముగా జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి బాలాజీ మాట్లాడుతూ అపజయాలను విజయ సోపానాలుగా మలుచుకుని లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు.
స్టేట్ అబ్జర్వర్ అపర్ణ మాట్లాడుతూ.. గుజరాత్ లోని వాద్ నగర్ లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమానికి ఎంపిక కావడానికి కావలసిన విధివిధానాలను తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్ర పాఠశాలల అనుసంధానం చేయబడి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వాన్ని ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని దేశం యొక్క సమగ్రతకు పాటుపడాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు టీచర్లు పాల్గొన్నారు. వివిధ దశలలో విద్యార్థులను స్క్రీనింగ్ చేసి జిల్లా నుండి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినది. వీరిని గుజరాత్ లోని వ్యాద్ నగర్ పాఠశాలకు అనుభవ పూర్వక అభ్యసన కార్యక్రమం నిమిత్తం, అక్కడి అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు పరిశీలించుటకు గాను పంపించడం జరుగుతుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన యువకిరణ్ నాయక్ మరియు కేంద్రీయ విద్యాలయం వన్ కి చెందిన కుమారి అక్షయ గుజరాత్ కి ఎంపిక అయిన విద్యార్థులను జిల్లా విద్యాకాఖధికారి శేఖర్ అభినందనలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ v. మధు డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ భాను ప్రకాష్ హెడ్మాస్టర్ జనార్దన్ రెడ్డి మరియు కేంద్రీయ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.