గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం(94) పరిధిలో ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉద్యోగేతరులు (వీడియోగ్రాఫర్స్, డ్రైవర్లు మొదలుగు వారు) వారి యొక్క ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికిని, ఈ నెల 26వ తేదీలోపు జిఎంసిలోని ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వద్ద ఫారం-12 సంబందించిన వివరాలు అందించాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు అదనపు కమిషనర్ & పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కె.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ని తొలుత ఈ నెల 22వ తేదీలోపు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రస్తుతం 26వ తేదీ వరకు గడువు పొడిగించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగేతరులు వారి ఓటు ఎక్కడ ఉన్నప్పటికినీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుని సమర్పించ వచ్చని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26 వ తేదీలోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ లో ఫారం-12(2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్ కాపీ, డ్యూటీ ఆర్డర్ కాపి తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది కార్యాలయ పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటారని తెలిపారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …