Breaking News

గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం… : షేక్ జలీల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించటంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్రంలో 21 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంది మాది జాతీయ పార్టీ కావడం వలన కొన్ని రాష్ట్రాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఇక్కడ కుడా అదే గుర్తు కేటాయించాలని కోరుతున్నామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి, నాదెండ్ల మనోహర్ నాపై దౌర్జన్యం చేసి తుపాకీతో బెదిరించారని అరోపించారు. ఎన్నికల పోటీ నుంచి పార్టీ అభ్యర్థులను తప్పుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. నామినేషన్లు వేసిన మా అభ్యర్థులకు రక్షణ కరువైంది వారికి రక్షణ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘంకు లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో డిజిపి మా అభ్యర్థులకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు మా కార్యాలయాలు ఇళ్లపై దాడులకు పాల్పడు తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో భాజాపాకు 110 లోక్ సభ సీట్లు, రాష్ట్రంలో వైకాపాకు 10 నుంచి 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వస్తాయి అని జోష్యం చెప్పారు. మా పార్టీ తరపు మహిళా అభ్యర్థులకు అధిక శాతం సీట్లు కేటాయించాం అన్నారు. మా అభ్యర్థులకు రక్షణ కల్పించాలి లేకుంటే హైకోర్టు సుప్రీంకోర్టులలో పిటిషన్ వేస్తాం అన్నారు. ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *