విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ విశాఖ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఓటర్ల అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థికృత ఓటర్ల విద్య, ఓటర్ల భాగస్వామ్యం కార్యక్రమం-స్వీప్( Systematic Voter’s Education and Electoral Programme-SVEEP)పై వయోజన ఓటర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సిబిసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధనపు డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీంద్ర్ చౌదరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌదరీ మాట్లాడుతూ ప్రపపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రీయలో అందరూ భాగం పంచుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వీప్ ద్వారా ప్రజల్లో ఎన్నికల పట్ల, ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్యంగా యువత ముందుకు రావాలని , ప్రజాస్వామ్యంలో అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కోరారు. స్వీప్ జిల్లా నోడల్ అధికారి మరియు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రామారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కల్పించడానికి వివిధ బృందాల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు హక్కుకు తగిన వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదవ్వాలని కోరారు. . కార్యక్రమంలో సిబీసీ సహాయ సంచాలకుడు షఫి మహామ్మద్ మాట్లాడుతూ దేశంలో ఓటింగ్ శాతం పెరగడానికి యువత కృషి చేసి, పటిష్ఠమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఉపప్రధానోపాధ్యాయురాలు వై లక్మ్షి, స్వీప్ టీం అధికారులు పుష్పరాజం, పోలీనాయుడు, విశాఖ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బాలకృష్ణ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Tags Visakhapatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …