అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేపలవేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతి చెల్లించుటకు మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్ ప్రారంభిస్తున్నామని ఎన్యూమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయనున్నామని మత్స్యశాఖ కమిషనర్ ఏ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సముద్రజలాల్లో 61 రోజులపాటు చేపలవేట నిషేదించినందున మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతీ సంవత్సరం చెల్లిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా జీవనభృతిని చెల్లించనున్నామని ఆమె తెలిపారు. జీవనభృతి చెల్లించుటకు ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా అనుమతిని కూడా తీసుకున్నామని ఆమె తెలిపారు. మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తామని మత్స్యకారులందరూ సహకరించవలసినదిగా మత్స్యశాఖ కమిషనర్ ఏ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …