Breaking News

జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్లు గృహ సందర్శన ద్వారా పంపిణీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

-డిబిటి ద్వారా నేటి నుండి సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ…. సచివాలయానికి పెన్షన్ల కొరకు ఎవరూ రావాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి బుధవారం మే1 నుండి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని, వయో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతోందని, మే1న నేడు డిబిటి ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని, నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలచుకున్న వారు డ్రా రేపటి నుండి చేసుకోవచ్చని ఎవరు కూడా వ్యయ ప్రయాసలకోర్చి సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం పలు మండలాల్లో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా తిరుపతి గ్రామీణ మండలం పరిధిలోని కె.సి. పేట లో విభిన్న ప్రతిభావంతులకు సచివాలయ సిబ్బంది పంచాయితీ సెక్రటరీ ద్వారా పెన్షన్ పంపిణీని పరిశీలించారు. అనంతరం రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామం నందు వయో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, మంచానికే పరిమితమైన వారికి పెన్షన్ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేసారు. అక్కడ గృహ సందర్శన ద్వారా మహేష్ కుమార్ అనే మంచానికి పరిమితమైన విభిన్న ప్రతిభావంతునికి పెన్షన్ పంపిణీ పరిశీలించారు. అనంతరం వడమాలపేట మండలం పూడి గ్రామ పరిధిలో పెన్షన్ల పంపిణీ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపిడిఓ వివరిస్తూ ఇంటి వద్దకు గృహ సందర్శన ద్వారా అందించాల్సిన పెన్షన్లు పూడి గ్రామ సచివాలయ పరిధిలో 142 ఉన్నాయని అందులో 70 శాతం పూర్తి చేశామని తెలిపారు. కలెక్టర్ సూచిస్తూ మండలంలోని సచివాలయం సిబ్బంది పెన్షన్ లాగ్ ఇన్ ఉన్నవారందరూ లాగ్ ఇన్ అయ్యి పెన్షన్ల పంపిణీ త్వరితగతిన పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించారు.

నేడు డిబిటి ద్వారా పెన్షన్ నగదు జమ ఐతుందని, నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలచుకున్న రేపు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. డిబిటి ఫెయిల్ అయిన వారికి రేపటి నుండి ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంఛార్జి పీడీ ప్రభావతి, తిరుపతి రూరల్ ఎంపిడిఓ రమేష్, ఆర్సి పురం ఎంపిడిఓ ప్రత్యూష, వడమాలపేట ఎంపిడిఓ సుజాత, డిఆర్డిఎ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *