రానున్నది చంద్రన్న రాజ్యమే…

రెడ్డిగూడెం. నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు సినియర్ తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బుధవారం రెడ్డిగూడెం పట్టణం లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ (గాంధీ) తో కలిసి యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే మన రాజధాని ఇక్కడ నుంచి తరలిపోతుంది. గడచిన ఐదేళ్లలో రైతుల కోసం కేవలం 500 కోట్లు కూడా ఖర్చ  చేయకపోవడం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు అగిపోయాయి. జగన్ ఐదేళ్ల పాలన లో తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచడం వలన  రాష్ట్రంలో చిన్న మద్యతరహ పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్రంలో ప్రజలంతా చంద్రబాబు కూటమి వైపే ఉన్నారని రానున్నది చంద్రన్న రాజ్యమే అని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారం లోకి రాగానే ప్రజా రాజధానిగా అమరావతి తో పాటు ఉచితంగా ఇసుక, పేదలకు అన్నా క్యాంటీన్ లు ఏర్పాటుతో పాటు నాసిరకం మధ్యం బ్యాన్ చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. అడుగడుగున అపూర్వ స్పందన తో జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు మహిళలు యువత ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అక్కల రామ్మోహన్, బిజెపి జనసేన పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *