Breaking News

అధికారులకు శిక్షణ కార్యక్రమం

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల పోలింగ్ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బుధవారం స్థానిక వి కె ఆర్ వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిఓలకు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణలో ముఖ్యాంశాలు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ముందు రోజు రిసెప్షన్ సెంటర్కు సకాలంలో చేరుకోవాలని, ఆలస్యంగా వస్తే రిజర్వులో పెడతారనే అపోహలు వీడాలని, ఆలస్యంగా వచ్చిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు, గర్భవతులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు గలవారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని, చిన్న చిన్న అనారోగ్య కారణాలతో మినహాయింపు కోరవద్దని సూచించారు. శిక్షణకు వచ్చిన మీరంతా ఎన్నికల సంఘం ఉద్యోగులుగా పరిగణింపబడతారని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదవి అర్థం చేసుకోవాలని కలెక్టర్ సూచిస్తూ, తద్వారా నిబంధనల పట్ల అవగాహన కలిగి పొరపాట్లకు ఆస్కారం ఉండదని, అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికాకుండా పోలింగ్ సజావుగా జరుగుతుందన్నారు. పొరపాటు జరిగినప్పుడు అనవసర అయాందోళనలకు గురికాకుండా నిజాయితీగా రిపోర్ట్ చేయాలని, ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేస్తే సహించమని, జరిగిన పొరపాటు గురించి థర్డ్ పార్టీ ఫిర్యాదు చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారని కలెక్టర్ ఉద్భోదించారు.

ప్రిసైడింగ్ అధికారిగా ఏఏ రిపోర్టులు, ఎప్పుడెప్పుడు, ఏ ఏ ఫారాల్లో ఇవ్వాలి అనే విషయాలు ముందుగా అవగాహన కలిగి ఉండాలని, ఖచ్చితమైన రిపోర్టులు పంపాలన్నారు. బ్యాలెట్ యూనిట్-వివి ప్యాట్-కంట్రోల్ యూనిట్ లను కనెక్ట్ చేయడంలో సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఎన్నికల నిర్వహణలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధతో, బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం గావించుటకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. గుడివాడ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ పి. పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *