Breaking News

సుజనా గెలుపు పేద ప్రజల గెలుపు

-అన్ని వర్గాల ప్రజలు మద్దతుస్తున్నారు
-బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు పేద ప్రజల గెలుపు అని రు బీజేపీ అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్ డి విల్సన్ అన్నారు. సుజనాతో మాల మహాసభ, నాయి బ్రాహ్మణ, వడ్డెర, మాదిగ దండోరా తదితర కులాల ప్రజలు పలు దఫాలుగా సమావేశమయ్యారని తెలిపారు. మాల మహాసభ అధ్యక్షుడు బండి బాలయోగి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కేవీ రామారావు, వేమూరి సీతారామయ్య, నాయకులతో కలసి విల్సన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ అభివృద్ధికి బాటలు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని, ప్రజలు ఆయనను నమ్ముతున్నారని, అందుకే సుజనా గెలుపు పేద ప్రజల గెలుపుగా తాను భావిస్తున్నానని విల్సన్ అన్నారు. కొండ ప్రాంతాల ప్రజల కడు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వారి జీవితాల్లో మార్పు సుజనా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సుజనా గెలుపుతో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. డబ్బుకు, మద్యానికి ప్రజలు ప్రభావితం కాకుండా సుజనాకు ఓటు వేసి గెలిపించాలని విల్సన్ కోరారు. అన్ని కులాల మద్దతు సుజనాకు ఉందని, కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాలని మీడియా మీట్ లో పాల్గొన్న నాయకులు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *