గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటి ఇంటి కి వెళ్లి కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిని ప్రత్తిపాటి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. బుధవారం ప్రత్తిపాటి అరుణకుమారి గన్నవరం నియోజకవర్గంలోని ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ తాను పోటీచేస్తున్న ‘ఆపిల్’ గుర్తుకి ఓటువేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి మౌళిక సదుపాయాల రూపకల్పనలో మరింత ముందుకు వెళతానన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడటానికి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటానన్నారు. ఒక సోదరిగా ఆశీర్వాదించాలని కోరారు. ఓటు శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి ఓటువేసి గెలిపించాలన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఇంటింటికి విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పత్తిపాటి శివశంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags gannavaram
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …